Home  »  TV News  »  Illu illalu pillalu : గుడిలో ప్రేమ రగడ.. ధీరజ్ భార్యగా పేరు చెప్పడానికి నిరాకరణ!

Updated : Aug 12, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్  547 లో..... గుడిలో పూజారి అర్చన చేయించడానికి ప్రేమని భర్త పేరు అడుగుతాడు. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ పేరుని చెప్పదు.. నన్ను భార్యగా ఒప్పుకోలేదు కదా, నేనెందుకు చెప్పాలని పొగరుగా నిరాకరిస్తుంది. భర్త పేరు చెప్పకపోవడం అశుభమని పూజారి, భద్రవతి, వేదవతి ఎంత చెప్పినా ప్రేమ వినదు. అదే టైంలో పూజారి రామరాజు గోత్రం అడగగా.. నేను అనాథను, దేవుడి గోత్రం మీద చేయండి అంటాడు. దాన్ని అవకాశంగా తీసుకున్న భద్రవతి.. దేవుడికి మంచి మనసే ముఖ్యమని మాటలు తిప్పి పూజ జరిపిస్తుంది. ఇక సుక్కూతో  శ్రీవల్లి మాట్లాడుతుంది. అత్త వాళ్ల ప్లాన్ చెడగొట్టాను. ప్రేమ-ధీరజ్ ని కలవనివ్వను. నర్మదను ఇంట్లో నుంచి పంపిస్తే నేనే ఇంటికి మహారాణిని అని గర్వంగా చెప్తుంది శ్రీవల్లి.

పూజ తర్వాత భద్రవతి, సేనాపతి రామరాజును తక్కువ చేసి మాట్లాడతారు. 500 కూడా హారతిలో వేయలేవు, నీకు పౌరుషం ఎందుకు? మాయ మాటలతో నా చెల్లిని, మేనకోడలిని లేపుకుపోయారని రామరాజుని ఇద్దరు రెచ్చగొడతారు. దేవుడి ముందు అందరూ సమానమే అని రామరాజు చెప్తాడు .. నిన్ను ఒంటరిగా చేస్తా. ప్రేమను మళ్లీ తీసుకెళ్లాలని చూసినా దేవుడు కూడా కాపాడలేడని రామరాజుకి భద్రవతి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఇటు వేదవతి, ధీరజ్, నర్మద.. ప్రేమతో ఒంటరిగా మాట్లాడి అమ్మ పుట్టినరోజు కుట్ర గురించి చెప్పాలనుకుంటారు. కానీ భద్రవతి ప్రేమను క్షణం కూడా వదలకపోవడంతో వేదవతి టెన్షన్ పడుతుంది. రామరాజు వచ్చి అందరిని కుంకుమార్చనకు తీసుకెళ్తాడు.
  
కుంకుమార్చనలో పూజారి.. భర్తతో కుంకుమ పెట్టించుకోండి, అది సౌభాగ్యానికి గుర్తు అని చెప్పినా ప్రేమ.. భార్యనే కాదన్నప్పుడు ఎలా అని కోపంగా లేచి వెళ్లిపోతుంది. భద్రవతి ప్రేమ వెంట వెళ్లబోతే సేనాపతి.. పూజ అయ్యే వరకు ఉండు అని ఆపుతాడు. ఇదంతా వల్లి సైగలతోనే జరుగుతుంది. ఇంకోవైపు అమూల్య విశ్వను పక్కకు పిలిచి.. ప్రేమ వదినను పూజకు తీసుకొచ్చింది ఒంటరిగా నాకు దొరికేలా చేయడానికే. నువ్వు సహాయం చెయ్ అని ప్లాన్ చెప్తుంది. తరువాయి భాగంలో ధీరజ్ తలకి దెబ్బ తగులుతుంది రక్తం వస్తుంది కానీ ప్రేమ అదంతా చూసి దూరం నుంచి బాధపడుతుంది కానీ దగ్గర కి వెళ్ళదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.